TSPSC EO Result: తెలంగాణలో నిర్వహించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2022 ఆగస్టు 27న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 181 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల ఫలితాలను కమిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 6, 7 తేదీలలో రెండు సెషన్లలో ఈవో ఉద్యోగాల భర్తీ కోసం వ్రాత పరీక్షను నిర్వహించారు. జనవరి 16న ప్రాథమిక కీ విడుదల చేశారు.
జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను ఈ లింకు ద్వారా చూడొచ్చు… https://www.tspsc.gov.in/uploadPDF/EO/EO_1122_GRL_TODISPLAY-print%20(1).pdf
టీజీపీఎస్సీ ఈవో పరీక్షలకు మొత్తం 26,751 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మూడు పేపర్లను 10,459మంది హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారందరికి జనరల్ ర్యాంకింగ్ కేటాయించారు.
ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిపుణులు సమీక్షించిన తర్వాత తుది కీను ఖరారు చేశారు. దాని ఆధారంగా ర్యాంకింగ్స్ ఖరారు చేశారు. జనరల్ ర్యాంకింగ్స్‌తో పాటు ఫైనల్ కీ, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లను కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. వీటిని టీజీ పీఎస్సీ వెబ్‌సైట్‌లో మార్చి 19 నుంచి ఏప్రిల్ 17 వరకు అందుబాటులో ఉంచుతారు.
ఈవో పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వాటిని డౌన్‌చేసుకోవచ్చు. రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేయడానికి టీజీపీస్సీ ఐడీ, హాల్ టిక్కెట్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీలను నమోదు చేయాల్సి ఉంటుంది. జనరల్ ర్యాంకింగ్‌పై అభ్యంతరాలను అనుమతించరు.
జనరల్ ర్యాంకింగ్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తారు. అర్హత సాధించిన వారికి వ్యక్తిగత సమాచారంతో పాటు కమిషన్ వెబ్‌సైట్‌లో జాబితా ప్రకటిస్తారు. అర్హత పొందిన అభ్యర్థులు కావాల్సిన పత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
స్త్రీ శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ 1 ఈవో ఉద్యోగాల ర్యాంకింగ్స్ విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే అభ్యరులు కమిషన్ హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు. 040-23542185, 2354 2187 నంబర్లలో సంప్రదించాల్సి ఉంటుంది. helpesk@tpsc.gov.in కు మెయిల్ చేయొచ్చు.
సంబంధిత కథనం