తెలంగాణ టెట్ కు అప్లయ్ చేశారా....? మీకోసమే ఈ కొత్త అప్డేట్, ఇదిగో ప్రాసెస్-tg tet mock test 2025 option now available on website ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ టెట్ కు అప్లయ్ చేశారా....? మీకోసమే ఈ కొత్త అప్డేట్, ఇదిగో ప్రాసెస్

తెలంగాణ టెట్ కు అప్లయ్ చేశారా....? మీకోసమే ఈ కొత్త అప్డేట్, ఇదిగో ప్రాసెస్

తెలంగాణ టెట్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు మరో అప్డేట్ ఇచ్చింది. వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అవగాహన కోసం ఉచితంగా మోడల్ పరీక్షలను రాసుకోవచ్చు.

తెలంగాణ టెట్ పరీక్షలు - అందుబాటులోకి మాక్ టెస్ట్ ఆప్షన్

తెలంగాణ టెట్‌ 2025 (జూన్ I) పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈనెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తాయి. పరీక్షల సమయం దగ్గరపడిన నేపథ్యంలో విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థులు ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఉచితంగా అభ్యర్థులు పరీక్షలు రాసుకునే వీలు ఉంటుంది.

టీజీ టెట్ 2025 మాక్ టెస్టులు - ప్రాసెస్ ఇలా

  1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో పైన కనిపించే టీజీ టెట్ మాక్ టెస్ట్ - 2025(జూన్) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే… మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
  4. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకొవచ్చు.
  5. ఈ పరీక్షలను రాయటం ద్వారా… ఆన్ లైన్ లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఓ అవగాహనకు రావొచ్చు.

టీచింగ్ బోధనకు టెట్ అర్హత తప్పనిసరి. అంతేకాకుండా డీఎస్సీలో వేయిటేజీ కూడా ఉంటుంది. కాబట్టి టెట్ లో క్వాలిఫై కావటంతో పాటు మంచి స్కోర్ సాధించటం కోసం అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతుంటారు. అయితే పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఈసారి ఎన్ని దరఖాస్తులంటే..?

ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్‌-1కు 63,261 , పేపర్‌-2కు 1,20,392 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరంతా కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.

విద్యాశాఖ తెలిపిన వివరాల ప్రకారం…. ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 04.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. పరీక్షల షెడ్యూల్ వివరాలను విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.

ఇక తెలంగాణ టెట్ పరీక్షల హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలతో సులభంగా పొందవచ్చు. టెట్ పరీక్షలు పూర్తైయిన తర్వాత ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత…. జూలై 22వ తేదీన టెట్‌ తుది ఫలితాలను విడుదల చేస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం