తెలంగాణ టెట్ 2024 (II) పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. విద్యాశాఖ వెబ్ సైట్ నుంచి వీటిని పొందవచ్చు. జనవరి 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో…. విద్యాశాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ఉచితంగా అభ్యర్థులు పరీక్షలు రాసుకునే వీలు ఉంటుంది.
టెట్ లో క్వాలిఫై కావటంతో పాటు మంచి స్కోర్ సాధించటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతుంటారు. అయితే పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది అప్లికేషన్ చేసుకున్నారు. పేపర్-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. వీరంతా కూడా జనవరి 2 నుంచి పరీక్షలు హాజరవుతారు. ఈ టెట్ పరీక్షలు జనవరి 20,2025వ తేదీతో పూర్తవుతాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.
ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ఎగ్జామ్ ముగుస్తుందని పేర్కొంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై... 04. 30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
సంబంధిత కథనం