TG TET II Results 2024 : పూర్తి కావొచ్చిన పరీక్షలు - ఫిబ్రవరి 5న తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల-tg tet ii all exams 2024 will end on 20th january 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Tet Ii Results 2024 : పూర్తి కావొచ్చిన పరీక్షలు - ఫిబ్రవరి 5న తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

TG TET II Results 2024 : పూర్తి కావొచ్చిన పరీక్షలు - ఫిబ్రవరి 5న తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 19, 2025 01:13 PM IST

తెలంగాణ టెట్ పరీక్షలు పూర్తి కానున్నాయి. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమైన ఎగ్జామ్… రేపటితో పూర్తవుతాయి. ఈసారి టెట్ పరీక్షల కోసం 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పరీక్షలు పూర్తైన వెంటనే ప్రాథమిక కీలు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

తెలంగాణ టెట్ పరీక్షలు
తెలంగాణ టెట్ పరీక్షలు

తెలంగాణ టెట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు.. రేపటితో (జనవరి 20) పూర్తి కానున్నాయి. దాదాపు 2 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షలు హాజరవుతున్నారు. అయితే పరీక్షలు పూర్తి అయిన వెంటనే… ప్రాథమిక కీలతో పాటు రెస్పాన్స్ షీట్లను అందుబాటులోకి రానున్నాయి.

yearly horoscope entry point

జనవరి 20తో టెట్ పరీక్షలన్నీ పూర్తి అవుతాయి. ఇప్పటికే కొన్ని పేపర్లకు సంబంధించిన ప్రాథమిక కీలు సిద్ధమైనట్లు తెలిసింది. మిగతా కీలను ప్రిపేర్ చేసి… విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే వారంలోనే ప్రాథమిక కీలను విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా… రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

టెట్ ప్రిలిమినరీ కీ ఎలా చెక్ చేసుకోవాలంటే..?

Step 1 : అభ్యర్థులు ముందుగా https://tgtet2024.aptonline.in/tgtet/ లేదా https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెెళ్లాలి.

Step 2 :హోం పేజీలో కనిపించే తెలంగాణట్ టెట్ - 2(2024) కీ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3 : ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని పేపర్ల సబ్జెక్టులు కనిపిస్తాయి. వాటి పక్కనే కీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది.

Step 4 : ప్రిలిమినరీ కీ ఆప్షన్ పై నొక్కితే మీకు కావాల్సిన కీ ఓపెన్ అవుతుంది.

Step 5 : ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

రెస్పాన్ షీట్లు ఎలా చెక్ చేసుకోవాలంటే…?

Step 1 : అభ్యర్థులు ముందుగా https://tgtet2024.aptonline.in/tgtet / లింక్ పై క్లిక్ చేయండి.

Step 2 :హోం పేజీలోని కనిపించే రెస్పాన్ షీట్లు లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3 :తర్వాత పేజీలో జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు, ఎగ్జామ్ పేపర్( Paper 1 or Paper 2) వివరాలు నమోదు చేయాలి.

Step 4 : ఆ తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే అభ్యర్థి రెస్పాన్స్ షీట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.

ఫలితాలు ఎప్పుడంటే..?

టెట్ కీల విడుదల తర్వాత అభ్యంతరాలను స్వీకరించనున్నారు. వీటిని పరిష్కరించి ఫైనల్ కీలను రూపొందిస్తారు. ఇక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 5వ తేదీన తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఫలితాలను https://schooledu.telangana.gov.in/ISMS/ లేదా https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

  1. తెలంగాణ టెట్(2) 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే TS TET(2) 2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్, Journal Number, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి… Get Results పై క్లిక్ చేయాలి.
  4. మీ స్కోర్ కార్డు ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
  6. భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

మరోవైపు ఈ ఏడాది తెలంగాణలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5 నుంచి 6వేల మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం