తెలంగాణ టెట్ - 2025 ఫలితాలు విడుదల - మీ స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి-tg tet 2025 results out hre direct link to check score card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ టెట్ - 2025 ఫలితాలు విడుదల - మీ స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ టెట్ - 2025 ఫలితాలు విడుదల - మీ స్కోర్ కార్డు ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ టెట్ - 2025 (జూన్ సెషన్) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు https://tgtet.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి స్కోర్ కార్డు చెక్ చేసుకోవచ్చు. ఈసారి మొత్తం 33.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో సాధించే స్కోర్ ఆధారంగా… డీఎస్సీ పరీక్షలో వేయిటేజీ కూడా కలుపుతారు.

తెలంగాణ టెట్ ఫలితాలు 2025

తెలంగాణ టెట్ - 2025 పరీక్షల (జూన్ సెషన్) ఫలితాలు వచ్చేశాయ్. విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ విధంగానే ఇవాళ రిజల్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా…. 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరయ్యారు. పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికి దరఖాస్తు చేసుకోగా…. 41,207 మంది(76.73 శాతం) మంది హాజరయ్యారు.

ఉత్తీర్ణత శాతం వివరాలు…

పేపర్ - 1 కు హాజరైన అభ్యర్థుల్లో 61. 50 (29043 మంది) శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక పేపర్ లోని మ్యాథ్స్,సైన్స్ విభాగంలో 35.87 శాతం(17574 మంది), సోషల్ స్టడీస్ విభాగంలో 31.73 శాతం(13075 మంది) పాస్ అయ్యారు. మొత్తంగా ఈసారి జరిగిన టెట్ పరీక్షలో 33.98 శాతం (30649 మంది) ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది.

తెలంగాణ టీజీ టెట్ రిజల్ట్స్ - ఇలా చెక్ చేసుకోవచ్చు

  1. అభ్యర్థులు ముందుగా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే తెలంగాణట్ టెట్ రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థి జర్నల్ నెంబర్, పరీక్ష పేపర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ స్కోర్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

తెలంగాణ టెట్ 2025 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు కేటాయిస్తారు. అయితే ఇందులో జనరల్‌ కేటగిరీలో ఉన్న అభ్యర్థులు 90 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులకు 75 మార్కులు రావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధిస్తే టెట్ అర్హత సాధించినట్లు అవుతుంది. ఇందులో సాధించే స్కోర్ ఆధారంగా… డీఎస్సీ పరీక్షలో వేయిటేజీ కలుపుతారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.