తెలంగాణ టెట్ హాల్ టికెట్లు ఆలస్యం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… హాల్ టికెట్లు ఇవాళ విడుదల కావాల్సి ఉంది. అయితే హాల్ టికెట్లు జూన్ 11వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విద్యాశాఖ నిర్ణయంచిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 18 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తాయి. నిజానికి జూన్ 15 నుంచే పరీక్షలు ప్రారంభం కావాల్సిన ఉన్నప్పటికీ…. విద్యాశాఖ తాజాగా మార్పులు చేసింది. 15 నుంచి కాకుండా 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హాల్ టికెట్లను ఇవాళ కాకుండా 11వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీటిలో పేపర్-1కు 63,261 , పేపర్-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి. వీరంతా కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
షెడ్యూల్ వివరాల ప్రకారం…. జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక జూన్ 24 న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) ఉంటుంది.
సంబంధిత కథనం