తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.... రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి-tg tet 2025 exams preliminary keys and response sheets released direct links here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.... రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.... రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీలు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ - 2025(జూన్ సెషన్) పరీక్షలు ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్ ప్రిలిమినరీ కీలు 2025

తెలంగాణ టెట్ (జూన్ సెషన్ ) -2025 పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలనే పరీక్షలు ముగియగా… తాజాగా ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిపై జూలై 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా…. 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరయ్యారు. పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికి దరఖాస్తు చేసుకోగా…. 41,207 మంది(76.73 శాతం) మంది హాజరయ్యారు.

టెట్ ప్రిలిమినరీ కీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..?

  • Step 1: తెలంగాణ టెట్(జూన్ సెషన్) 2025 పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Step 2 :హోం పేజీలో కనిపించే తెలంగాణట్ టెట్ ప్రిలిమినరీ కీ లింక్ పై క్లిక్ చేయాలి.
  • Step 3 : ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అన్ని పేపర్ల సబ్జెక్టులు కనిపిస్తాయి. వీటిల్లో మీరు రాసిన సబ్జెక్ట్ పై క్లిక్ చేయాలి.
  • Step 4 : మీ సబ్దెక్ట్ కు సంబంధించిన ప్రాథమిక 'కీ' డిస్ ప్లే అవుతుంది అవుతుంది.
  • Step 5 : ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

టెట్ రెస్పాన్స్ షీట్లు డౌన్లోడ్ ప్రాసెస్….

  • అభ్యర్థులు ముందుగా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, ఎగ్జామ్ పేపర్ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది.

అభ్యంతరాలను ఇలా నమోదు చేయండి….

తెలంగాణ టెట్ ప్రాథమిక కీలపై అభ్యంతరాలు ఉంటే విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. అయితే ఆన్ లైన్ లోనే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థులు ముందుగా https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే Objections అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అభ్యర్థి జర్నల్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ పేపర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంట్రీ చేయాలి. ప్రొసిడ్ ఆప్షన్ పై నొక్కి మీ అభ్యంతరాలను ఎంట్రీ చేయవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.