తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. పరీక్షలు రాసిన విద్యార్థులు ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13వ తేదీ వరకు వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 24,415 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే 73.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి…
తెలంగాణ పదో తరగతి రెగ్యూలర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30, 2025న ప్రకటించారు. ఈ సంవత్సరం రెగ్యులర్ అభ్యర్థులకు మొత్తం ఉత్తీర్ణత శాతం 92.78 శాతంగా నమోదైంది. అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 91.32 శాతం కాగా, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 94.26 శాతంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోకెల్లా 99.29 శాతం ఉత్తీర్ణత రేటుతో ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.