తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అయితే పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే తుది ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రాథమిక కీని అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ - 2025 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ ఏడాది 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హత పొందిన వారు… పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతారు.
త్వరలోనే తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. అధికారుల ప్రకటించిన వివరాల ప్రకారం… పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. దీని ప్రకారం మే 13వ తేదీన పరీక్ష జరగగా… మే 24వ తేదీన లేదా ఆ తర్వాత తేదీల్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల భర్తీ ఉంటుంది. సీట్లు మిగిలే స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. పూర్తి వివరాలను రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి వెల్లడిస్తుంది.
సంబంధిత కథనం