పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వివరాలను వెల్లడించింది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు… ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. మొత్తం 2 విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
ఈ ఏడాది జరిగిన పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని… సీట్లు పొందాల్సి ఉంటుంది. ఈసారి కొత్తగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది.ఈసారి మొత్తం 28,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.