తెలంగాణ పాలిసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను తెలంగాణ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈనెల 13వ తేదీన పాలిసెట్ - 2025 పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 81.88 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పాలిసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. విడతల వారీగా సీట్ల భర్తీ ఉంటుంది. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి.
సంబంధిత కథనం