రేపు తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష - నిమిషం రూల్ అమలు..!-tg polycet 2025 exam will be conducted on may 13 know these key instructions ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  రేపు తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష - నిమిషం రూల్ అమలు..!

రేపు తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్ష - నిమిషం రూల్ అమలు..!

తెలంగాణ పాలిసెట్ 2025 పరీక్షకు సర్వం సిద్ధమైంది. మే 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 276 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ జరగనుంది. ఈసారి 1,06,716 మంది విద్యార్థులు పాలిసెట్ కు దరఖాస్తు చేసుకున్నారు.

టీజీ పాలిసెట్ - 2025 పరీక్ష

తెలంగాణలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ - 2025 పరీక్షకు సర్వం సిద్ధమైంది. రేపు(మే 13)వ తేదన రాష్ట్రవ్యాప్తంగా 276 కేంద్రాల్లో ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

టీజీ పాలిసెట్ 2025 పరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని ఇంజనీరింగ్‌, నాన్ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. రేపు ఉదయం 11.00 గంటల నుంచి నుండి మధ్యాహ్నం 1.30 వరకు ఎగ్జామ్ ఉంటుంది.

ఈ ఏడాది పాలిసెట్ పరీక్ష కోసం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సంబంధించిన హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

నిమిషం నిబంధన అమలు..!

విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి ఒక గంట ముందుగానే అనుమతించనున్నారు. అయితే నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. దీనిబట్టి ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎవర్నీ బయటికి వెళ్లేందుకు అనుమతించరు. ఇక హాల్ టికెట్ మీద ఫొటో ప్రింట్ కానివారు పాస్ ఫోటోతో పాటు ఆధార్ కార్డు తీసుకునిరావాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్ తో పాటు ఏ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు కానీ అనుమతించబడవు.

తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తారు. ఆ తర్వాత కౌన్సెలింగ్ విడుదల చేస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. ఇందులో 85 శాతం స్థానికులకు మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే లోకల్(స్థానికం)గా పరిగణిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం