తెలంగాణలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్.. (పీజీఈసెట్)-2025 గురించి మరో అప్‌డేట్ వచ్చింది. పీజీఈసెట్-2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ (మార్చి 17న) ప్రారంభం కానుంది. ఇటీవలే పీజీఈసెట్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను జేఎన్‌టీయూహెచ్ నిర్వహించనుంది.
అభ్యర్థులు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా మే 19 వరకు pgecet.tgche.ac.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము చెల్లించినట్లయితే.. వారు జూన్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు జూన్ 16 నుంచి 19 వరకు జరుగుతాయి. హాల్ టిక్కెట్లను జూన్ 7న విడుదల చేస్తారు. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పరీక్షలకు హాజరు కావాలనుకుంటే.. దానికి అనుగుణంగా ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ప్రారంభం- మార్చి 17
ఆలస్య రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ గడువు- మే 19
సవరణ విండో- మే 22 నుండి 24 వరకు
దరఖాస్తు గడువు (రూ.250 ఆలస్య రుసుముతో)- మే 22
దరఖాస్తు గడువు (రూ.1,000 ఆలస్య రుసుముతో)- మే 25
దరఖాస్తు గడువు (రూ.2,500 ఆలస్య రుసుముతో)- మే 30
దరఖాస్తు గడువు (రూ.5,000 ఆలస్య రుసుముతో)- జూన్ 2
అడ్మిట్ కార్డ్/హాల్ టికెట్ విడుదల తేదీ- జూన్ 7
పరీక్ష తేదీలు- జూన్ 16 నుంచి 19 వరకు
ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) మోడ్‌లో నిర్వహిస్తారు. గేట్, జీప్యాట్‌లో అర్హత సాధించిన వారిని మొదట చేర్చుకొని.. ఖాళీగా ఉన్న సీట్లను పీజీఈసెట్‌లో సాధించిన ర్యాంక్, స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.