టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి-tg pecet 2025 results released direct link here to download rank card ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల - మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ పీఈసెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు pecet.tgche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ర్యాంక్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి.

టీజీ పీఈసెట్ ఫలితాలు విడుదల

రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎంట్రెన్స్ లో అర్హత సాధించిన వారికి బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఫలితాలను ఇవాళ అందుబాటులోకి వచ్చాయి.

బీపీఈడీలో 1257 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా… డీపీఈడీలో 460 426 మంది క్వాలిఫై అయ్యారు. బీపీఈడీలో ఎస్ జ్యోతిర్మయి తొలి స్థానంలో నిలిచింది. డీపీఈడీలో చింతం ఉమాశ్రీకి ఫస్ట్ ర్యాంక్ దక్కింది.

టీజీ పీఈసెట్ ఫలితాలు - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

  1. పరీక్ష రాసిన అభ్యర్థులు https://pecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంట్రీ చేయాలి.
  4. మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ పొందవచ్చు.
  6. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ పీఈసెట్ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.