తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అలర్ట్ - 'కీ' విడుదల, మీ రెస్పాన్స్ షీట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి-tg lawcet 2025 updates preliminary key and response sheets released ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అలర్ట్ - 'కీ' విడుదల, మీ రెస్పాన్స్ షీట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అలర్ట్ - 'కీ' విడుదల, మీ రెస్పాన్స్ షీట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ లాసెట్ - 2025 ప్రిలిమినరీ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు lawcet.tgche.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచారు.

తెలంగాణ లాసెట్ - 2025

తెలంగాణ లాసెట్ -2025 అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే పరీక్ష పూర్తి కాగా…. తాజాగా ప్రాథమిక కీలు వచ్చేశాయి. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఇందుకు జూన్ 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

టీజీ లాసెట్ ప్రాథమిక కీని ఇలా చెక్ చేసుకోండి:

  1. పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://lawcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే "Master Question Papers with Key" ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మూడేళ్ల లా కోర్సు, ఐదేళ్ల కోర్సుతో పాటు ఎల్ఎల్ ఎం కోర్సు ప్రశ్నాపత్రాల ఆప్షన్లు కనిపిస్తాయి.
  4. ఇందులో మీరు రాసిన పరీక్ష పేపర్ పై క్లిక్ చేస్తే… కీ తో కూడిన ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

మీ రెస్పాన్స్ షీట్ ఇలా పొందండి

  1. టీజీ లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://lawcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే Response Sheets అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ అభ్యర్థి రిజిస్ట్రేష్ నెంబర్, లాసెట్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  4. గెట్ రెస్పాన్స్ షీట్ పై నొక్కితే రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

జూన్ 25న లాసెట్ ఫలితాలు!

తెలంగాణ లాసెట్ ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ గడువు జూన్ 13వ తేదీతో పూర్తవుతుంది. అభ్యంతరాల పరిశీలన తర్వాత… జూన్ 25వ తేదీన తుది ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల వెల్లడించిన తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు. విడతల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

అభ్యర్థి సాధించిన ర్యాంకుతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసి… సీటు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కాలేజీల్లో సీట్లు మిగిలితే స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసే ఛాన్స్ ఉంటుంది.ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.