తెలంగాణ లాసెట్ షెడ్యూల్ - 2025 విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు...ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 4 వేల ఆలస్య రుసుంతో మే 25వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ లాసెట్ - 2025 ఎంట్రెన్స్ ద్వారా మూడేళ్ల లా, ఐదేళ్ల లా కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లోనూ ప్రవేశాలను కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఈ అడ్మిషన్లు ఉంటాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది. గతేడాది కూడా ఓయూనే నిర్వహించింది.
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు.
సంబంధిత కథనం