TG Law Admissions : టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదల-ముఖ్య తేదీలివే
TG Law Admissions : తెలంగాణలో లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లా సెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

TG Law Admissions : తెలంగాణల లాసెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదలైంది. 2025-26 విద్యాసంవత్సరానికి లా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్ షెడ్యూల్‌ను ఇవాళ విడుదల చేసింది. ఫిబ్రవరి 25న ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
టీజీ లాసెట్, పీజీఎల్ సెట్ ముఖ్యతేదీలు
- నోటిఫికేషన్ జారీ - ఫిబ్రవరి 25
- ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం - మార్చి 1
- ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ - ఏప్రిల్ 15
- ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ - మే 25
- పరీక్ష తేదీ- జూన్ 6
అర్హతలు
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://lawcetadm.tsche.ac.in/ ను సందర్శించండి.
టీజీ ఈసెట్ షెడ్యూల్
టీజీ ఈసెట్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ ఏడాది ఈసెట్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. తెలంగాణలో డిప్లొమా హోల్డర్లు, బీఎస్సీ (గణితం), బీటెట్, బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాన్ని ఈసెట్ నిర్వహిస్తారు.
ముఖ్య తేదీలు
- నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 25
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం- మార్చి 3
- ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ(ఆలస్య రుసుముతో) -ఏప్రిల్ 19
- పరీక్ష తేదీ- మే 12
టీజీ ఈఏపీసెట్ షెడ్యూల్
తెలంగాణ ఈఏపీసెట్-2025 షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 22 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ను జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది.
ముఖ్య తేదీలు
- ఫిబ్రవరి 20 - నోటిఫికేషన్ విడుదల
- ఫిబ్రవరి 22- ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం
- మే 2-5 - ఇంజినీరింగ్ పరీక్ష
- ఏప్రిల్ 29, 30 - అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు
సంబంధిత కథనం