Inter Summer Holidays : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులను ప్రకటించింది. మార్చి 30, 2025 నుంచి జూన్ 1, 2025 వరకు వేసవి సెలవులు అని అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సంస్థలతో సహా అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించబడింది. తిరిగి కాలేజీలు జూన్ 2, 2025 పునః ప్రారంభమవుతాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. వేసవి సెలవులను విద్యార్థులు తమ స్వీయ అధ్యయనం, నైపుణ్యాభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని బోర్డు కోరింది.
వేసవి సెలవుల్లో ఏవరైనా అనధికార తరగతులు నిర్వహిస్తున్నట్లు తేలితే ఆసంస్థలు బోర్డు మార్గదర్శకాల ప్రకారం కఠినమైన చర్యలను తీసుకుంటామని హెచ్చిరించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరిన్ని వివరాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృష్ణ ఆదిత్య..ఇంటర్ వాల్యుయేషన్ క్యాంపు అధికారులను పారదర్శక మూల్యాంకన ప్రక్రియను జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. స్క్రూటినైజర్లు, సబ్జెక్ట్ నిపుణులు మూల్యాంకన క్యాంపులలో మూల్యాంకనాలను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు.
బోర్డ్ అధికారులతో జరిగిన సమావేశంలో....పరీక్షలకు హాజరు విద్యార్థులు, మాల్‌ప్రాక్టీస్ కేసులు, OMR డేటాకు సంబంధించిన బార్‌కోడ్‌లను నిర్వహించడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. జోన్ అధికారులు, సూపరింటెండెంట్లు ఈ సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. మూల్యాంకన ప్రక్రియ సమయంలో నామినల్ రోల్స్‌లో దిద్దుబాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.
క్యాంపు ఆఫీసర్లు క్యాంపులలో బార్‌కోడ్‌లపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మార్కులు ఇవ్వడంలో కచ్చితత్వం, నిర్ధారించడానికి అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, సబ్జెక్ట్ నిపుణులు సమాధాన స్క్రిప్ట్‌లను పూర్తిగా సమీక్షించాలన్నారు. క్యాంపులలో పార్ట్ 3 ధృవీకరణ పూర్తయిన వెంటనే ఆన్ లైన్ లో డేటాను సంకలనం చేయాలన్నారు. ఫలితాలను విడుదల చేసే ముందు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) ధృవీకరిస్తుందని తెలిపారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా అవసరమైన చోట పరీక్ష స్క్రిప్ట్‌లను అవసరమైన చోట తిరిగి మూల్యాంకనం చేస్తారన్నారు.
సంబంధిత కథనం