రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తాజాగానే ప్రత్యేక విడత ప్రవేశాల(స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్) కింద సీట్లను కేటాయించారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు టీజీ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పటివరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ ఏడాది చేరిన వారి సంఖ్య 30,371గా ఉంది. ఇంకా 7,489 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 288 కాలేజీలు ఉండగా…. ఎంబీఏలో25,743 సీట్లు నిండాయి. ఇక ఎంసీఏలో 4,628 సీట్లు భర్తీ అయ్యాయి.
ప్రత్యేక విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగానే ఐసెట్ స్పాట్ అడ్మిషన్ల ప్రకటన రానుంది. ఈనెల 13వ తేదీన మార్గదర్శకాలను ప్రకటిస్తామని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లో వివరాలను పొందుపరుస్తారు.
సంబంధిత కథనం