రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయింది. తాజా స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి కాగా… ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు జరుగుతున్నాయి.అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు.
టీజీ ఐసెట్ ప్రత్యేక విడత ప్రవేశాల్లో భాగంగా ప్రస్తుతం వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ ఇవాళ్టితో(అక్టోబర్ 7) పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
ఇక ఇవాళే వెబ్ ఆప్షన్ల ప్రీజింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ ఫేజ్ కింద అక్టోబర్ 10వ తేదీలోపు సీట్లను కేటాయిస్తారు. ఇదే రోజు నుంచి 13వ తేదీ వరకు సెల్ఫ్, కాలేజీలో రిపోర్టింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. కాబట్టి నిర్దేశించిన తేదీలోపు ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
ఇక రాష్ట్రంలో మొత్తం 276 మేనేజ్‌మెంట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 30,587 సీట్లు అందుబాటులో ఉన్నాయి.వీటిల్లో 26,131 సీట్లు భర్తీ అయ్యాయి. ఇక 79 కాలేజీల్లో 7,227 ఎంసీఏ సీట్లుండగా… 4,723 నిండాయి. మిగిలిన సీట్లు భర్తీ కావాల్సి ఉంది. వీటి భర్తీ కోసమే తాజాగా స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రత్యేక విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి కాగానే స్పాట్ అడ్మిషన్ల ప్రకటన రానుంది. ఈనెల 13వ తేదీన మార్గదర్శకాలను ప్రకటిస్తామని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. https://tgicet.nic.in/default.aspx వెబ్ సైట్ లో వివరాలను పొందుపరుస్తారు.
సంబంధిత కథనం