ఈనెల 7న తెలంగాణ ఐసెట్‌ - 2025 ఫలితాలు …. ఎలా చెక్ చేసుకోవాలంటే..?-tg icet 2025 results to be released on july 7 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఈనెల 7న తెలంగాణ ఐసెట్‌ - 2025 ఫలితాలు …. ఎలా చెక్ చేసుకోవాలంటే..?

ఈనెల 7న తెలంగాణ ఐసెట్‌ - 2025 ఫలితాలు …. ఎలా చెక్ చేసుకోవాలంటే..?

టీజీ ఐసెట్‌ -2025 ఫలితాలు విడుదల కానున్నాయి. జూలై 7వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు icet.tgche.ac.in వెబ్ సైట్ ద్వారా ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టీజీ ఐసెట్‌ ఫలితాలు

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జూలై 7వ తేదీన రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రవి ఓ ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 8, 9 తేదీలో ఐసెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలను కల్పిస్తారు.

టీజీ ఐసెట్ 2025 ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే

  1. పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని టీజీ ఐసెట్ రిజల్ట్స్ 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. మీ హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు మరిన్ని వివరాలను నమోదు చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే మీ ఫలితానికి సంబంధించిన కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.

పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి సీట్లను కేటాయిస్తారు. ర్యాంక్ ఆధారంగా వీటిని కేటాయిస్తారు. గతేడాది ఐసెట్ సీట్లకు బాగా డిమాండ్ కనిపించింది. ఈసారి కూడా అదే మాదిరిగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.