తెలంగాణ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల... ఇలా డౌన్లోడ్ చేసుకోండి-tg icet 2025 hall ticekts released here direct link to download ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల... ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు విడుదల... ఇలా డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు icet.tgche.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 8,9 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ ఐసెట్ 2025 హాల్ టికెట్లు

తెలంగాణ ఐసెట్ - 2025 హాల్ టికెట్లు వచ్చేశాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్ష జూన్ 8,9 తేదీల్లో జరగనుంది.ప్రతి రోజూ రెండు సెషన్లు ఉంటాయి. రెండు రోజుల్లో మొత్తం నాలుగు సెషన్లు జరుగుతాయి.

టీజీ ఐసెట్ హాల్ టికెట్లు - డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా

  1. ముందుగా అభ్యర్థులు https://icet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే Download HallTicket లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  4. సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

జులై 27న ఐసెట్ ఎంట్రెన్స్ ఫలితాలు…

జూన్ 8,9 తేదీల్లో తెలంగాణ ఐసెట్ పరీక్షలను నిర్వహిస్తారు. సీబీటీ(కంప్యూటర్ బేస్డ్) విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం సెషన్ ఉంటుంది.

తెలంగాణ ఐసెట్ - 2025 ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి జూన్ 21న పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జులై 7న ఫలితాలను ప్రకటిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.