టీజీ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 14 నుంచే స్లాట్‌ బుకింగ్, ముఖ్య తేదీలివే-tg ecet 2025 counseling schedule released key dates here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 14 నుంచే స్లాట్‌ బుకింగ్, ముఖ్య తేదీలివే

టీజీ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 14 నుంచే స్లాట్‌ బుకింగ్, ముఖ్య తేదీలివే

తెలంగాణ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం రెండు విడతల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత పొందిన విద్యార్థులు… జూన్ 14 నుంచి 18వ తేదీ వరకు స్లాట్‌ బుకింగ్ చేసుకోవాలి. ముఖ్యమైన తేదీల వివరాలను పూర్తి కథనంలో తెలుసుకోండి….

టీజీ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్

తెలంగాణ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఎంట్రెన్స్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అర్హత పొందిన పాలిటెక్నిక్ విద్యార్థులకు… బీటెక్ సెకండ్ ఇయర్ , బీఫార్మసీ సెకండ్ ఇయర్ లోకి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈసెట్ 2025లో అర్హత పొందిన వారికి కౌన్సెలింగ్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది.

టీజీ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు:

  • తెలంగాణ ఈసెట్‌ -2025 కౌన్సెలింగ్‌ జూన్ 14 నుంచి ప్రారంభంకానుంది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 14 నుంచి 18 వరకు స్లాట్‌ బుకింగ్ చేసుకోవాలి.
  • జూన్ 17 నుంచి 19వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
  • జూన్ 17వ తేదీ నుంచి నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవాలి.
  • జూన్ 25వ తేదీన ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు జూన్ 29వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.

ఫైనల్ ఫేజ్ :

  • ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో భాగంగా జూలై 11 నుంచి 13 వరకు స్లాట్‌ బుకింగ్ చేసుకోవాలి.
  • జూలై 14వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
  • జులై 14 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
  • జూలై 15వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ కు అవకాశం ఉంటుంది.
  • జూలై 18వ తేదీలోపు సీట్ల కేటాయింపు
  • జులై 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్(వెబ్ సైట్ ద్వారా)
  • జూలై 19 నుంచి 22వ తేదీల మధ్య సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి.
  • జూలై 23వ తేదీలోపు విద్యార్థులు అడ్మిషన్లు పొందాలి. లేకపోతే సీటు రద్దవుతుంది.

తెలంగాణ ఈసెట్ 2025 స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి జులై 22వ తేదీన మార్గదర్శకాలను జారీ చేస్తారు. జూలై 29వ తేదీలోపు సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం