బీటెక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది. మొత్తం 3 విడతల్లో సీట్ల భర్తీని చేపటనున్నారు. జూన్ 28వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఇక ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ల ఎంట్రీకి 18-08-2025 నుంచి 19-08-2025 వరకు అవకాశం ఉంటుంది. ఆగస్టు 19వ తేదీన ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 22లోపు స్లైడింగ్ సీటు కేటాయింపు ఉంటుంది. 22-08-2025 నుండి 23-08-2025 మధ్య కొత్త బ్రాంచ్‌కు రిపోర్టింగ్(సీటు పొందిన కాలేజీలో) చేసుకోవచ్చు. ఆగస్టు 23వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన ప్రకటన ఉంటుంది. సీటు పొందే విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. లేకపోతే సీటను రద్దు చేస్తారు.