రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాలను టీజీ ఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్ష ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 2 నుంచి 4 వరకు నిర్వహించారు. మొత్తం 2,88,388 మంది పరీక్షలు రాశారు. వీరిలో అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్లు… 81,198 మంది ఉన్నారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులు…. 2,07,190 మంది ఉన్నారు. వీరంతా కూడా వారి మార్కులతో పాటు ర్యాంకులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాల్లో ఏపీకి చెందిన భరత్ చంద్ర సత్తా చాటాడు. 150కిపైగా మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మూడో ర్యాంక్ కూడా ఏపీకి(విజయనగరం) చెందిన సూర్య కార్తీక్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంక్ కృష్ణారెడ్డికి(రంగారెడ్డి జిల్లా) దక్కింది.
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.
అగ్రికల్చర్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... మొత్తం 81198 మంది విద్యార్థులు హాజరుకాగా...71309 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది 87.82 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం ఉన్నారు.
టీజీ ఈఏపీసెట్-2025 ర్యాంకుల ఆధారంగా…. యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో… కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. వీటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
సంబంధిత కథనం