TG EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి-tg eapcet 2025 bipc stream counselling starts from today ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Eapcet 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

TG EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

టీజీఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈనెల 8వ తేదీతో గడువు పూర్తవుతుంది. ఈనెల 13 లేదా ఆలోపే సీట్లను కేటాయిస్తారు.

టీజీఈఏపీసెట్ బైపీసీ కౌన్సెలింగ్ 2025

తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు…. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 13వ తేదీ లేదా ఆలోపే మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. ఇక సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 13 నుంచి వెబ్ సైట్ లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.

ఇందులో భాగంగా అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు. రెండు విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మా డి, బీటెక్‌ బయోటెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులున్నాయి. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.

  • టీజీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 8వ తేదీతో ముగుస్తుంది.
  • ఇక అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
  • ఇక అక్టోబర్ 8వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. 10 వరకు వీటిని ఎంచుకోవచ్చు.
  • అక్టోబర్ 13వ తేదీ లేదా ఆలోపే మొదటి విడత సీట్లను కేటాయిస్తారు.
  • ఇక సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 13 నుంచి వెబ్ సైట్ లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఈ గడువు అక్టోబర్ 14వ తేదీతో పూర్తవుతుంది. నిర్దేశించి న సమయంలోపు రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…

  • అర్హులైన విద్యార్థులు https://tgeapcetb.nic.in/payFeeOnline.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ముందుగా లాగిన్ వివరాలను నమోదు చేయాలి. ఇందులో TGEAPCET-B హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • ఆ తర్వాత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.(బీసీ, ఓసీ రూ1200, ఎస్సీ ఎస్టీ రూ. 600)
  • అనంతరం స్లాట్ బుకింగ్ ఆప్షన్ పై నొక్కి ప్రాసెస్ రిజిస్రేషన్ పూర్తి చేసుకోవాలి.
  • వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంచుకోవాలి.
  • అలాట్ మెంట్ కాపీని కూడా ఇదే వెబ్ సైట్ నుంచి పొందాలి.

ఇక టీజీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. అక్టోబర్ 18వ తేదీన ఆప్షన్లను ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 21 లేదా ఆ లోపే సీట్లను కేటాయిస్తారు. రిపోర్టింగ్ ప్రక్రియ అక్టోబర్ 23వ తేదీతో ముగుస్తుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ - కావాల్సిన పత్రాలు:

  • TGEAPCET -2025 ర్యాంక్ కార్డు
  • టీజీ ఈఏపీసెట్ హాల్ టికెట్
  • ఆధార్ కార్డు
  • టెన్త్ మెమో
  • ఇంటర్ మెమో
  • ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • టీసీ
  • ఆదాయపు ధ్రువీకరణపత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • రెసిడెన్సీ సర్టిఫికెట్
  • ఇతర పత్రాలు

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం