విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' చివరి విడత రిజిస్ట్రేషన్ కు మరికొన్ని గంటలే గడువు..! 23న సీట్ల కేటాయింపు-tg dost 2025 updates third phase registrations will end on june 19 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' చివరి విడత రిజిస్ట్రేషన్ కు మరికొన్ని గంటలే గడువు..! 23న సీట్ల కేటాయింపు

విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' చివరి విడత రిజిస్ట్రేషన్ కు మరికొన్ని గంటలే గడువు..! 23న సీట్ల కేటాయింపు

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు జూన్ 19వ తేదీతో పూర్తవుతుంది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న వారికి… జూన్‌ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది.

దోస్త్ రిజిస్ట్రేషన్లు 2025

తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం చివరి విడత(థర్డ్ ఫేజ్) రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు కూడా దగ్గరపడింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 19వ తేదీలోపే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు… వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. సమయం దగ్గరపడిన నేపథ్యంలో…. అభ్యర్థులు వెంటనే ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జూన్ 23న సీట్ల కేటాయింపు….

దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి మొదలైంది. ఈ గడువు జూన్ 19తో పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్లు ఈ తేదీల్లోనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్‌ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూన్ 24 నుంచి 28వ తేదీల మధ్య ఓరియేంటేషన్ ఉంటుంది. జూన్ 30వ తేదీన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.

‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…

  1. ముందుగా దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. చివరల్లో Aadhaar Authentication ప్రక్రియ పూర్తవుతుంది.
  4. ఆ తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
  5. దీని ద్వారా మీ లాగిన్ ప్రక్రియ ముందుకెళ్తుంది.
  6. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా నిర్ణయించిన ఫీజును తప్పకుండా చెల్లించాలి.
  7. దోస్త్ లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
  8. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఇంటర్ లో సాధించిన మార్కులతో పాటు రిజర్వేషన్ ఆధారంగా డిగ్రీ కాలేజీలో సీటును కేటాయిస్తారు.

ఉన్నత విద్యామండలి నిర్ణయించిన మూడు విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.