తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి కాగా… ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
దోస్త్ సెకండ్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఈ గడువు రేపటితో (జూన్ 9) పూర్తి కానుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.