తెలంగాణ డీఈఈసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. పరీక్ష రాసిన విద్యార్థులు డీఈఈసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ మే 25వ తేదీన జరిగింది.
టీజీ డీఈఈసెట్ లో అర్హత పొందిన వారికి…. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృత్తి విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంట్రెన్స్ పరీక్షలో వచ్చిన ర్యాంక్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ సారి 78.18 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 33,321 మంది పరీక్షరాస్తే, వీరిలో 28,442 మంది (78.18శాతం) క్వాలిఫై అయ్యారు.
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో D.El.Ed , D.P.S.E. లలో ప్రవేశానికి డీఎస్ఈ ప్రతి సంవత్సరం టీజీ డీఈఈసెట్ పరీక్షను నిర్వహిస్తుంది. ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా డీఈఈసెట్ ప్రవేశ పరీక్షకు 43,616 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో… త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం సీట్లలో 85 శాతం సీట్లను స్థానిక అభ్యర్థులకు… మిగతా 15 శాతం సీట్లను స్థానికేతరులకు కేటాయిస్తారు.