TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం-tg deecet 2025 notification released applications start march 24th onwards ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Deecet 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

TG DEECET 2025 : తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రెండేళ్ల డీఈడీ కోర్సు్లో ప్రవేశానికి డీఈఈసెట్ నిర్వహిస్తారు. రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

TG DEECET 2025 : తెలంగాణలో రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. డీఈఈసెట్ కు రేపటి నుంచి (మార్చి 24వ) తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మే 15వ తేదీ వరకు ఇంటర్ పాసైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 25న ఆన్ లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

అయితే ఈ ఏడాది చాలా ముందుగా మార్చి 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ఏడాది జూన్‌లో నోటిఫికేషన్‌ జారీ అయిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే దాదాపు రెండున్నర నెలల ముందుగానే నోటిఫికేషన్ వచ్చింది. దీంతో సకాలంలో కౌన్సెలింగ్‌ పూర్తై త్వరగా డీఈడీ తరగతులు ప్రారంభమవుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా నవంబరు, డిసెంబరులో తరగతులు ప్రారంభం అవుతున్నాయి.

85 శాతం సీట్లు స్థానికులకు

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో D.El.Ed , D.P.S.E. లలో ప్రవేశానికి డీఎస్ఈ ప్రతి సంవత్సరం టీజీ డీఈఈసెట్ పరీక్షను నిర్వహిస్తుంది. టీజీ డీఈఈసెట్ 2025 సెట్ ను మే నెలలో నిర్వహించనున్నారు. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 85% సీట్లను స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేస్తుంది. అయితే 15% సీట్లు స్థానికేతరులకు రిజర్వ్ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • టీజీ డీఈఈసెట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం - మార్చి 24, 2025
  • టీజీ డీఈఈసెట్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ -మే 15, 2025
  • టీజీ డీఈఈసెట్ పరీక్ష తేదీ -మే25, ​​2025

టీజీ డీఈఈసెట్ 2025 అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో (SC/ST/PH అభ్యర్థులకు 45%) ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. టీజీ డీఈఈసెట్ కు కనీస వయస్సు సెప్టెంబర్ 1, 2025 నాటికి 17 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి లేదు. ఈ విద్యా అర్హత, వయస్సు ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను అభ్యసించడానికి డీఈఈసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం