టీజీ సీపీగెట్ - 2025 అప్డేట్… దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!-tg cpget 2025 updates online applications to closed on july 28 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ సీపీగెట్ - 2025 అప్డేట్… దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

టీజీ సీపీగెట్ - 2025 అప్డేట్… దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రూ. 2 ఆలస్య రుసుంతో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ గడువు కూడా జూలై 28వ తేదీతో పూర్తవుతుంది. దీంతో అప్లికేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఆగస్టు 4 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

టీజీ సీపీగెట్ 2025

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆలస్యం రుసుం లేకుండా అప్లికేషన్లు ముగియగా.. ప్రస్తుతం రూ. 2 వేల ఫైన్ తో అప్లయ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ గడువు కూడా జూలై 28వ తేదీతో పూర్తవుతుంది.

పీజీ చేయాలనుకునే అభ్యర్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రేపటితో అప్లికేషన్ల స్వీకరణ మొత్తం ముగుస్తుందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. https://cpget.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లించాలి.

ఆగస్టు 4 నుంచి పరీక్షలు

ఆగస్టు 4వ తేదీ నుంచి టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 11వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు ముగుస్తాయి. ప్రతి రోజూ 3 సెషన్లు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 1 నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇక చివరి సెషన్ 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు.

మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. సబ్జెక్టుల వారీగా తేదీలను https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.

టీజీ సీపీగెట్ -2025 లో భాగంగా పలు సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. విడతల వారీగా ప్రవేశాల ప్రక్రియను చేపడుతారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.