టీజీ సీపీగెట్ 2025 నోటిఫికేషన్ విడుదల - ఈనెల 18 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే-tg cpget 2025 notification released key dates here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  టీజీ సీపీగెట్ 2025 నోటిఫికేషన్ విడుదల - ఈనెల 18 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

టీజీ సీపీగెట్ 2025 నోటిఫికేషన్ విడుదల - ఈనెల 18 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే

తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీగెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. జూన్ 18వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు వివరాలను వెల్లడించారు.

టీజీ సీపీగెట్ నోటిఫికేషన్

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు వివరాలను వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

జూన్ 18 నుంచి దరఖాస్తులు...

టీజీ సీపీగెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభవుతుంది. జూలై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 ఆలస్య రుసుంతో జూలై 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది. రూ. 2 వేలతో జూలై 28 వరకు ఛాన్స్ ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి. https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.

టీజీ సీపీగెట్ లో భాగంగా పలు సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.