TG TET II Results 2024 : ఫిబ్రవరి 5న తెలంగాణ టెట్ ఫలితాల వెల్లడి - విద్యాశాఖ ప్రకటన-telangana tet 2 results 2024 will be released on 5th february 2025 know these steps ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Tet Ii Results 2024 : ఫిబ్రవరి 5న తెలంగాణ టెట్ ఫలితాల వెల్లడి - విద్యాశాఖ ప్రకటన

TG TET II Results 2024 : ఫిబ్రవరి 5న తెలంగాణ టెట్ ఫలితాల వెల్లడి - విద్యాశాఖ ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 25, 2025 06:38 AM IST

TG TET II Results 2024 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీన తుది ఫలితాలను ప్రకటించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రాథమిక కీలపై జనవరి 27లోపు అభ్యంతరాలను పంపాలని సూచించింది. విద్యాశాఖ వెబ్ సైట్ లో టెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్ 2 ఫలితాలు
తెలంగాణ టెట్ 2 ఫలితాలు

తెలంగాణ టెట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగానే పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను కూడా విద్యాశాఖ ప్రకటించింది. ప్రస్తుతం అభ్యంతరాలను స్వీకరిస్తోంది. ఈ గడువు జనవరి 27వ తేదీతో పూర్తవుతుంది. ఇదిలా ఉంటే తుది ఫలితాలపై విద్యాశాఖ అప్డేట్ ఇచ్చింది.

ఫిబ్రవరి 5న టెట్ తుది ఫలితాలు…

తెలంగాణ టెట్ ఫలితాలను ఫిబ్రవరి 5వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ లేదా https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

టెట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?

  1. తెలంగాణ టెట్(2) 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. తెలంగాణ టెట్ 2 లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది.
  3. హోంపేజీలో కనిపించే TS TET(2) 2024 Results పై క్లిక్ చేయాలి.
  4. మీ హాల్ టికెట్ నెంబర్, Journal Number, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి… Get Results పై క్లిక్ చేయాలి.
  5. మీ స్కోర్ కార్డు ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
  7. భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఈ ఏడాది జనవరి 2 నుంచి టెట్ పరీక్షలు జరిగాయి. జనవరి 20వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,05,278 మంది పరీక్షకు హాజరయ్యారు.

ప్రిలిమినరీ కీల పై ఎలాంటి అభ్యంతరాలు ఉంటే విద్యాశాఖకు పంపవచ్చు. జనవరి 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను తెలియజేయవచ్చని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిర్ణీత ఫార్మాట్ లో ఈ వివరాలను పంపాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన లింక్స్ కూడా వెబ్ సైట్ లో ఉన్నాయి.

మరోవైపు ఈ ఏడాదిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5 నుంచి 6వేల మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం