తెలంగాణ టెట్ 2024 (II) పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం రాత్రి సమయానికి అందుబాటులోకి వచ్చాయి. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు జనవరి 20,2025వ తేదీతో పూర్తవుతాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.
ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది అప్లికేషన్ చేసుకున్నారు. పేపర్-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ఎగ్జామ్ ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై... 04. 30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.
సంబంధిత కథనం