TG TET II Exams 2024 : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు - సబ్జెక్టులవారీగా తేదీలివే..!-telangana tet 2 exams 2024 will start from tomorrow find the complete schedule details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Tet Ii Exams 2024 : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు - సబ్జెక్టులవారీగా తేదీలివే..!

TG TET II Exams 2024 : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు - సబ్జెక్టులవారీగా తేదీలివే..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 01, 2025 06:06 AM IST

TG TET II Exam 2024 Dates: తెలంగాణ టెట్‌ 2024 (II) పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచే ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరీక్షలన్నీ జనవరి 20వ తేదీతో ముగుస్తాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ ఎగ్జామ్ ఫలితాలను ప్రకటిస్తారు.

తెలంగాణ టెట్ పరీక్షలు 2024
తెలంగాణ టెట్ పరీక్షలు 2024

రేపట్నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి టెట్ పరీక్షల కోసం 2 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు... జనవరి 20వ తేదీతో పూర్తవుతాయి.

yearly horoscope entry point
  • ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది అప్లికేషన్ చేసుకున్నారు.
  • పేపర్‌-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్‌-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి.
  • ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ఎగ్జామ్ ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై... 04. 30 గంటలకు పూర్తవుతుంది.
  • టెట్ అభ్యర్థులు schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయి.
  • ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.

పరీక్షల షెడ్యూల్ ఇలా....

  • విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేప‌ర్-1 ప‌రీక్షల‌ను నిర్వహించనున్నారు.
  • పేప‌ర్ -2 ప‌రీక్షల‌ను జ‌న‌వ‌రి 2, 5, 11, 12, 19, 20వ తేదీల్లో జరగుతాయి.
  • జ‌న‌వ‌రి 2వ తేదీన ఉద‌యం, మ‌ధ్యాహ్నం సెష‌న్లలో సోష‌ల్ స్టడీస్(పేప‌ర్-2) జరగనుంది.
  • జ‌న‌వ‌రి 5న ఉద‌యం సెష‌న్‌లో సోష‌ల్ స్టడీస్(పేప‌ర్ -2), మ‌ధ్యాహ్నం మ్యాథ‌మేటిక్స్ అండ్ సైన్స్(పేప‌ర్-2) ప‌రీక్ష జరగనుంది.

ఉచితంగా మాక్ టెస్టులు...

తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ఉచితంగా అభ్యర్థులు పరీక్షలు రాసుకునే వీలు ఉంటుంది.

టెట్ లో క్వాలిఫై కావటంతో పాటు మంచి స్కోర్ సాధించటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతుంటారు. అయితే పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోంపేజీలో పైన కనిపించే TG TET Mock Test-2024-II అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే… మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకొవచ్చు. ఈ పరీక్షలను రాయటం ద్వారా… ఆన్ లైన్ లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఓ అవగాహనకు రావొచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం