TG Revenue Department Jobs : తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు, ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
TG Revenue Department Jobs : తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 పోస్టులను మంజూరు చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని నియామకాలు చేపట్టనున్నారు.
TG Revenue Department Jobs : తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు మంజూరు చేశారు. మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని, వీటి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గతంలో వీఆర్వోలుగా పనిచేసి ప్రస్తుతం పలుశాఖల్లో ఉన్న 6 వేల మందిని గ్రామపంచాయతీ పాలనా అధికారులుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అదనంగా మరో 4 వేల పోస్టులకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోనుంది. ఉగాది తర్వాత 50 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 58 వేల పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు
సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్- జాతీయ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 ఖాళీలను భర్తీ చేయనుంది. ఓపెన్ కోటాలో 8 ఖాళీలు ఉన్నాయి. మార్చి 17వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా...ఏప్రిల్ 21వ తేదీ(సాయంత్రం 6) వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు. రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ,మహిళ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిలో అర్హులైన వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. విద్యా అర్హతలే కాకుండా పని అనుభవంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియను స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది.
దరఖాస్తు విధానం
- అర్హులైన అభ్యర్థులు CSIR-NGRI అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- కెరీర్ సెక్షన్ లోకి వెళ్లి Recruitment of Scientist ఆప్షన్ పై నొక్కాలి. ఇక్కడ ఆన్ లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత నిర్ణయించిన దరఖాస్తు రుసుంను చెల్లించాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- దరఖాస్తు ఫామ్ పూర్తి చేయటంతో పాటు అడిగిన ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
సంబంధిత కథనం