TG Polycet 2025: నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ, మే 13న ప్రవేశ పరీక్ష-telangana polycet 2025 applications accepted from today entrance exam on may 13 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Polycet 2025: నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ, మే 13న ప్రవేశ పరీక్ష

TG Polycet 2025: నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ, మే 13న ప్రవేశ పరీక్ష

Sarath Chandra.B HT Telugu

TG Polycet 2025: తెలంగాణలో పాలిటెక్నిక్‌ ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్‌ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అందించే ఇంజనీరింగ్‌, నాన్ ఇంజనీరింగ్‌, టెక్నాలజీ కోర్సుల్లో పాలీసెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మే 13న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణలో పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల

TG Polycet 2025: తెలంగాణ పాలిసెట్‌ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మే 13న పాలిసెట్‌ నిర్వహించనున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సుల్ని నిర్వహిస్తున్నారు. వ్యవసాయ కోర్సుల్ని ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీ, హార్టికల్చర్ కోర్సుల్ని కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ హార్టీ కల్చర్ యూనివర్శిటీ, యానిమల్ హజ్బెండరీ-ఫిషరీస్ కోర్సుల్ని పీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీల ద్వారా అందిస్తారు.

పాలిసెట్‌ నోటిఫికేషన్‌ కోసం ఈ లింకును అనుసరించండి…

ముఖ‌్యమైన తేదీలు ...

పాలీసెట్‌ 2025 దరఖాస్తుల స్వీకరణ మార్చి 19 న ప్రారంభం అవుతుంది.

ఏప్రిల్ 19వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

రూ.100 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

రూ.300 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

మే 13న పాలిసెట్‌ 2025 నిర్వహిస్తారు.

పాలిసెట్‌ పరీక్ష ఫలితాలు పరీక్ష జరిగిన 12 రోజుల్లో విడుదల చేస్తారు.

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ…

తెలంగాణలో 'పాలిసెట్-2025' కు దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభం అవుతుంది. ఈ మేరకు పాలిసెట్ కన్వీ నర్ పుల్లయ్య మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు రుసుం రూ.250, ఇతరులకు రూ.500గా నిర్ణయించారు. ఏప్రిల్ 19.వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 21 వరకు, రూ.300తో 23 వరకు అవకాశం ఉంది. ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సు లకు ఇటీవల ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాది రిగానే పాలిటెక్నిక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటా యించనున్నారు.

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో మొత్తం కన్వీనర్ కోటా సీట్లే ఉంటాయి. అందులో 85% స్థానిక, మిగిలిన 15% స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే లోకల్(స్థానికం)గా పరిగణిస్తారు. స్థానికేతర కోటా అంటే పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు, ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు.

పాలిటెక్నిక్ ఫీజు భారీగా పెంపు

తెలంగాణలో పాలిటెక్నిక్ కోర్సుల ఫీజులను భారీగా పెంచారు. గత పదేళ్లుగా పాలిటెక్నిక్‌ వార్షిక ఫీజు రూ.14,900గా ఉండగా... 2023-24, 2024-25 లతోపాటు వచ్చే విద్యా సంవత్సరా నికి గరిష్ఠ ఫీజు రూ.39 వేలకు చేరింది. రాష్ట్రంలోని 55 ప్రైవేట్ కళాశాలలకు ఫీజు నిర్ణయించగా.. అందులో 48 కళాశాలలకు రూ.39 వేలు ఫీజును ఖరారు చేవారు.మరికొన్ని కళాశాలలకు రూ.25 వేల నుంచి రూ.35 వేలుగా ఖరారు చేశారు. కేవలం రెండు కళాశాలలకే రూ.14,900, రూ.15 వేలుగా ఫీజు నిర్ణయించారు.

ఈ మేరకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీజీఏఎస్ఆర్సీ) ఫీజులను నిర్ణయించింది. దశాబ్ద కాలంగా పాలిటెక్నిక్‌ ఫీజులు పెంచ లేదని, తాజా పరిస్థితులకు అనుగుణంగా రుసుమును నిర్ణయించాలని 2023-24 విద్యా సంవత్సరంలో కొన్ని కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.

పెంచిన ఫీజులు 2023-24, 2024-2025 లతో పాటు వచ్చే 2025-26 విద్యా సంవత్సరానికి కూడా వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ కింద రూ.14,900 మాత్రమే చెల్లిస్తోంది. రాష్ట్రంలో ఏటా డిప్లొమా కోర్సుల్లో సుమారు 30 వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం