TG PECET Schedule 2025: తెలంగాణ పీఈసెట్ షెడ్యూల్ విడుదల - మార్చి 15 నుంచి దరఖాస్తులు, ముఖ్య తేదీలివే
Telangana PECET Schedule 2025 : తెలంగాణ పీఈ సెట్ 2025 షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 15 నుంచి అప్లికేషన్లు ప్రారంభమవుతాయి. జూన్ 11వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యూకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్ పరీక్షలను మహబూబ్ నగర్ లోని పాలమూరు యూనివర్శిటీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
పీఈసెట్ 2025 షెడ్యూల్ - ముఖ్య తేదీలు
తెలంగాణ పీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12వ తేదీన విడుదలవుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 15వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 24 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అపరాధ రుసుంతో మే 30 వరకు అప్లికేషన్ చేసుకునే వీలు ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎంట్రెన్స్ పరీక్షలు జూన్ 11తో ప్రారంభమై.... జూన్ 14వ తేదీతో ముగుస్తాయి. ఉన్నత విద్యామండలి తరపున పాలమూరు యూనివర్శిటీ.. ప్రవేశాల ప్రక్రియ బాధ్యతలు నిర్వహించనుంది.
ముఖ్య వివరాలు:
- ఎంట్రెన్స్ పరీక్ష - ఫిజికల్ ఎడ్యూకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2025, తెలంగాణ
- పరీక్షల నిర్వహణ బాధ్యలు - పాలమూరు యూనివర్శిటీ, మహబూబ్ నగర్ జిల్లా
- తెలంగాణ పీఈసెట్ నోటిఫికేషన్ - 12 మార్చి 2025.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులు ప్రారంభం - 15 మార్చి 2025
- దరఖాస్తులకు చివరి తేదీ - 24 మే 2025
- అపరాధ రుసుంతో దరఖాస్తులకు చివరి తేదీ - 30 మే 2025
- ఎంట్రెన్స్ పరీక్షలు ప్రారంభం - 11 జూన్ 2025
- పరీక్షలకు చివరి తేదీ - 14 జూన్ 2025
- అధికారిక వెబ్ సైట్ లింక్స్ - https://tgche.ac.in/ , https://www.palamuruuniversity.com/
మరోవైపు లాసెట్ 2025 షెడ్యూల్ విడుదలైంది. శనివారం ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 1 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 25వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది.
సంబంధిత కథనం