తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి-telangana open ssc exams 2025 results out ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఓపెన్ టెన్త్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు… www.telanganaopenschool.org వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మరోవైపు ఇంటర్ ఫలితాలు కూడా వచ్చాయి.

తెలంగాణ ఓపెన్ టెన్త్ వివరాలు

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌) పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఏప్రిల్, మే మధ్యలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు… టాస్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

టీజీ ఓపెన్ టెన్త్ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  • విద్యార్థులు ముందుగా https://www.telanganaopenschool.org వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే రిజల్ట్స్ సెక్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ ఓపెన్ టెన్త్ రిజల్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ విద్యార్థి అడ్మిషన్ లేదా రూల్ నెంబర్ ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల కాపీని పొందవచ్చు.

ఈసారి మొత్తం 28,547 మంది అభ్యర్థులు ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయగా, 16,443 (57.80) శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12 నుంచి 18 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు.

ఓపెన్ ఇంటర్ ఫలితాలు విడుదల:

మరోవైపు తెలంగాణ ఓపెన్ ఇంటర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు టాస్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అడ్మిషన్ నెంబర్ లేదా రూల్ నెంబర్ ఎంట్రీ చేసి స్కోర్ వివరాలను పొందవచ్చని అధికారులు సూచించారు. ఈసారి మొత్తం 41,051మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా…24,538 మంది పాస్ అయ్యారు.

ఈనెల 12న కొత్త నోటిఫికేషన్:

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌)లో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు కొత్త నోటిఫికేషన్ రానుంది. ఇందుకు అధికారులు ముహుర్తం ఖరారు చేశారు. జూన్ 12వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. ఇదే రోజు నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు షురూ అవుతాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 12 వరకు మీసేవా ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.