తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు… 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు.
ఏప్రిల్ 27వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు ఎగ్జామ్ నిర్వహించారు. ఇదే రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10 తరగతుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించారు. క్వాలిఫై అయిన విద్యార్థులకు…. 2025 - 2026 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.