TG Model School Admissions 2025 : తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్లు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!-telangana model school admission applications ends on 20th march 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Model School Admissions 2025 : తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్లు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

TG Model School Admissions 2025 : తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్లు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

Telangana Model School Admissions 2025 : తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు మార్చి 20వ తేదీతో పూర్తవుతుంది. ఏప్రిల్ 20వ తేదీన ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు... వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో(ఆదర్శ పాఠశాలలు) ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు మార్చి 20వ తేదీతో పూర్తి కానుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. అర్హులైన విద్యార్థులు... వెంటనే అప్లికేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

నోటిఫికేషన్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఇక ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. ఏప్రిల్ 13వ తేదీన పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేశారు. ఏప్రిల్ 15 తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం - రాత పరీక్ష తేదీలు

అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు రుసుం కింద ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ 20, 2025వ తేదీన జరుగుతుంది.

ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.ఇక 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు… మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలలు ఎగ్జామ్ సెంటర్లుగా ఉంటాయి.

ముఖ్య వివరాలు:

  • మోడల్‌ స్కూల్స్ ప్రవేశాలు - 2025- 2026 విద్యా సంవత్సరం.
  • ప్రవేశాలు కల్పించే తరగతులు - 6, 7, 8, 9, 10.
  • దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ ద్వారా.
  • దరఖాస్తులకు తుది గుడువు - 20 మార్చి 2025.
  • హాల్ టికెట్లు డౌన్లోడ్ - 15 ఏప్రిల్ 2025.
  • పరీక్ష తేదీ - 20 ఏప్రిల్, 2025.

ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి…

ఏడో తరగతి నుంచి 10వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి…

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం