TG Model School Admissions 2025 : తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్లు - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ప్రాసెస్ ఇలా
TG Model School Admissions 2025 Updates: తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ షురూ అయింది. ఈ విద్యా సంవత్సరానికి నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్ష కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు.. http://telanganams.cgg.gov.in లింక్ తో అప్లికేషన్ చేసుకోవచ్చు.
తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2025 - 2026 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు… 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు.
దరఖాస్తులు ప్రారంభం
మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తుల జనవరి 6వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.http://telanganams.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ 13, 2025వ తేదీన జరగుతుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
- ముందుగా http://telanganams.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో Notification - TGMS VI CLASS - 2025 ఆప్షన్ తో పాటు Notification - TGMS VII TO X CLASS-2025 కనిపిస్తుంంది. వీటికి చివరల్లో అప్లికేషన్ ప్రాసెస్ లింక్ డిస్ ప్లే అవుతుంది.
- ముందుగా నిర్ణయించిన అప్లికేషన్ రుసుం చెల్లించాలి.
- ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేస్తే మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలను ఎంట్రీ చేసి చివర్లో సబ్మిట్ నొక్కితే ప్రాసెస్ పూర్తి అవుతుంది.
- చివరల్లో ప్రాసెస్ పూర్తి అయ్యాక… ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ ను గుర్తుంచుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ సమయంలో ఉపయోగపడుతుంది.
ముఖ్య తేదీలు:
మోడల్ స్కూల్స్ ప్రవేశాలు - 2025- 2026 విద్యా సంవత్సరం.
ప్రవేశాలు కల్పించే తరగతులు - 6, 7, 8, 9, 10.
దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు తుది గుడువు - ఫిబ్రవరి 28, 202
హాల్ టికెట్లు డౌన్లోడ్ - ఏప్రిల్ 03, 2025
పరీక్ష తేదీ - ఏప్రిల్ 13, 2025
వెబ్ సైట్ - http://telanganams.cgg.gov.in
సంబంధిత కథనం