తెలంగాణ వైద్య ఆరోగ్య సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు....ఫార్మసిస్ట్ గ్రేడ్ -II పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల చేసింది. మొత్తం 732 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. 732 పోస్టులకు మొత్తం 27,101 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 24,578 మంది పరీక్షకు హాజరయ్యారు.
అభ్యర్థులు మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. పరీక్ష ఫలితాలు, ఫైనల్ కీ, మాస్టర్ క్వశ్చర్ పేపర్ ను అభ్యర్థులకు అందుబాటు ఉంచింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని బోర్డు ప్రకటించింది.
1.ఫార్మసిస్ట్ గ్రేడ్-II పోస్టుల నియామకం కోసం గతేడాది నవంబర్ 30న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు డిసెంబర్ 12న “ప్రిలిమినరీ కీ” విడుదల చేశారు. సబ్జెక్ట్ నిపుణులతో కూడిన “కీ కమిటీ” అభ్యర్థుల అభ్యంతరాలను పరిశీలించింది.
2. అన్ని అభ్యంతరాలను వివరంగా పరిశీలించిన తర్వాత, “కీ కమిటీ” సెషన్-2 ప్రశ్న నెంబర్ 811427487 మినహా ప్రిలిమినరీ కీలో ఇచ్చిన అన్ని సమాధానాలు సరైనవని అభిప్రాయపడింది. అందుకు తగిన విధంగా సమాధానాన్ని మార్పుచేసింది.
3. ఈ మార్పుతో “ప్రిలిమినరీ కీ” “ఫైనల్ కీ” గా పరిగణించింది.
4. “ఫైనల్ కీ” ని MHSRB వెబ్‌సైట్ లో ఉంచింది.
5. MHSRB “ఫైనల్ కీ” ఆధారంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష “నార్మలైజేషన్ మార్కులు” విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత వారి మార్కులను యాక్సెస్ చేయవచ్చు.
6. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు/సంస్థలు/కార్యక్రమాలలో కాంట్రాక్ట్/అవుట్‌సోర్స్డ్ సేవ కోసం వెయిటేజీని క్లెయిమ్ చేసిన దరఖాస్తుదారులకు వెయిటేజీ పాయింట్లను జోడించిన తర్వాత “తాత్కాలిక మెరిట్ జాబితా” విడుదల చేయనున్నారు.
సంబంధిత కథనం