TG LAWCET 2025 Updates : తెలంగాణ 'లాసెట్' కు ప్రిపేర్ అవుతున్నారా..? పరీక్షా విధానం, సిలబస్ వివరాలివే
TG LAWCET 2025 Updates : తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. రూ. 4 వేల ఆలస్య రుసుంతో మే 25వ తేదీ వరకు గడువు ఉంది. అయితే ఈ ఎంట్రెన్స్ పరీక్షా విధానం, సిలబస్ వివరాలను ఇక్కడ చూడండి….
తెలంగాణలోని న్యాయ కళాశాల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రతి ఏడాది లాసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కూడా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ రాగా… ఆన్ లైన్ లో అప్లికేషన్లను కూడా స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 15వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏప్రిల్ 25 వరకు రూ.500 జరిమానా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మే 5 వరకు రూ. 1,000 ఆలస్యం రుసం, మే 15 వరకు రూ.2,000, మే 25 వరకు రూ.4,000 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 20 - 25 తేదీల మధ్య ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. జూన్ 6వ తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉంటుంది.
టీజీ లాసెట్ సిలబస్ 2025 వివరాలు:
- తెలంగాణ లాసెట్ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సులకు వేర్వురు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది.
- ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సు పరీక్షా విధానం చూస్తే పార్ట్ ఏలో 30 మార్కులు ఉంటాయి. General Knowledge and Mental Ability నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- పార్ట్ బీ సెక్షన్ కు కూడా 30 మార్కులు కేటాయించారు. Current Affairs నుంచి ప్రశ్నలు వస్తాయి.
- పార్ట్ సీ సెక్షన్ లో 60 మార్కులు ఉంటాయి. Aptitude for the Study of Law నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా భారత రాజ్యాంగం నుంచి క్వశ్చన్లు ఉంటాయి. లీగల్ పరిభాషకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి.
- ఇక ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పార్ట్ ఏ, బీ ఉంటాయి. పార్టీ ఏ సెక్షన్ నుంచి 40 మార్కులు ఉంటాయి.JURISPRUDENCE సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు, CONSTITUTIONAL LAW నుంచి 20 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్ లో 80 మార్కులు ఉంటాయి. లేబప్ లా, క్రైమ్స్ అండ్ టార్ట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషన్ లా, బిజిెన్స్ అండ్ కార్పొరేట్ లా నుంచి ప్రశ్నలు అడుగుతారు.
సంబంధిత కథనం