TG JL Certificate Verification : జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు అలర్ట్, ఈ నెల 21 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
TG JL Certificate Verification : తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల జేఎల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
TG JL Certificate Verification : తెలంగాణ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు సంబంధించి ఇటీవల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 21 నుంచి 31వ తేదీ వరకు నిర్దేశించిన కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు వెనుక ఉన్న ఎంఏఎం మోడల్ జూనియర్ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీజీపీఎస్సీ జేఎల్ పోస్టులకు ఎంపికైన అధ్యాపకుల జాబితాను ఇంటర్ విద్యాశాఖకు అందించింది. మొత్తం 1392 పోస్టులకు గానూ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ విడుదల కాగా...మూడేళ్లుగా నియామక ప్రక్రియ కొనసాగుతోంది. కేసుల కారణంగా కొందరికే ధ్రువపత్రాల పరిశీలన జరపనున్నారు. 1,288 మంది అభ్యర్థులకు మాత్రమే జనవరి 21 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. కోర్టు కేసుల పరిష్కారం అనంతరం మిగిలిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు.
వరంగల్ నిట్ లో ఉద్యోగాలు
నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి వరంగల్‌లోని ‘నిట్’(NIT) ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మొత్తం 6 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిక్రూట్ చేయనున్నారు.ఎంపికైన వారు ఏడాది కాలం పాటు పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
దరఖాస్తు విధానం
ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. ఫిబ్రవరి 7, 2025వ తేదీతో అప్లికేషన్ గడువు పూర్తి అవుతుంది. రాత్రి 11.59 గంటల లోపు అప్లికేషన్ చేసుకోవాలి. https://nitw.ac.in/Careers/ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే recruit_admn@nitw.ac.in మెయిల్ చేయవచ్చు. ఇక సాంకేతిక సమస్యలు ఉంటే recruit@nitw.ac.in మెయిల్ ను సంప్రదించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. .ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ముఖ్య వివరాలు :
- ఉద్యోగ ప్రకటన - నిట్ వరంగల్,
- మొత్తం ఖాళీలు - 06
- ఖాళీల వివరాలు : విజిటింగ్ కన్సల్టెంట్ (లీగల్ అడ్వైజర్)- 01, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ - 1, విజిటింగ్ కన్సల్టెంట్ (ఆర్కిటెక్ట్ - 01, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ - 01, స్టూడెంట్ కౌన్సెలర్ - 01,. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ -1
- ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
- దరఖాస్తులకు చివరి తేదీ - ఫిబ్రవరి 07, 2025.
- ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
- ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచారు
- అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/Careers/
సంబంధిత కథనం