తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్య వివరాలివే-telangana iti admissions 2025 notification released key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్య వివరాలివే

తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్య వివరాలివే

తెలంగాణలోని ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 21వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. iti.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ తో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

తెలంగాణ ఐటీఐ ప్రవేశాలు 2025

తెలంగాణలో ఈ ఏడాదికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత (ఆగస్టు -2025) కింద ప్రవేశాలను కల్పించనున్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2025-26 సెషన్‌కు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. జూన్‌ 21వ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://iti.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

తెలంగాణ ఐటీఐ అడ్మిషన్లు - ముఖ్య వివరాలు:

  • ప్రవేశాల ప్రకటన - ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం, తెలంగాణ రాష్ట్రం
  • కోర్సులు - ఐటీఐ కోర్సు (2025-26)
  • అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్నింటినికి 8వ తరగతిని విద్యా అర్హతగా నిర్ణయించారు.
  • వయోపరిమితి - 14 ఏళ్లు నిండి ఉండాలి.
  • సీట్ల కేటాయింపు - అకడమిక్ మెరిట్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో
  • దరఖాస్తులు రుసుం - రూ. 100 చెల్లించాలి.
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - జూన్ 21 , 2025
  • ఆన్ లైన్ దరఖాస్తులో వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దు.
  • ముఖ్యమైన పత్రాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి.
  • ముఖ్యంగా సరైన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://iti.telangana.gov.in/
  • ఈ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.