TG Inter Exams 2025 : తెలంగాణలో మార్చి 5 నుంచి మార్చి 25 వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇంటర్ పరీక్షలను ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో మొత్తం 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇంటర్ పరీక్షలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లతో సహా 1,532 మంది పరీక్షా సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.
అన్ని పరీక్షా కేంద్రాలకు రవాణా సదుపాయాలు, తాగునీరు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వచ్చే వారికి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వనున్నామన్నారు. విద్యార్థుల సందేహాలు పరిష్కరించడానికి నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ ఉదయం 8:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు పనిచేస్తుందన్నారు. విద్యార్థులు తక్షణసహాయం కోసం 040-24600110, 9240205555 నెంబర్లను సంప్రదించవచ్చని కార్యదర్శి సూచించారు.
అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చుతాం. వీటిని ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 33 స్క్రీన్‌ల ద్వారా పర్యవేక్షిస్తారు. మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ గడియారాలు, సాధారణ గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను పరీక్షా హాళ్ల లోపలకు అనుమతించరు. విద్యార్థులు ఈ వస్తువులను పరీక్ష కేంద్రాలలో నిర్దేశించిన గదులలో జమ చేయాలి. పరీక్ష సమయంలో విద్యార్థులకు సమయం తెలియజేయడానికి ప్రతి అరగంటకు గంట మోగిస్తారు. పరీక్ష రాసేందుకు సహాయం అవసరమైన దివ్యాంగ విద్యార్థులకు చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో స్క్రైబ్‌లను అందిస్తారు.
విద్యార్థులు పరీక్షలకు బాగా సిద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, ఒత్తిడికి లోనకావొద్దని కార్యదర్శి కోరారు. 90 రోజుల నిర్మాణాత్మక సన్నాహక ప్రణాళిక పరీక్ష ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ఆన్సర్ షీట్ల మూల్యాంకనం కోసం, వరంగల్, మెదక్‌లతో సహా 19 మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
1.మొత్తం పరీక్షా కేంద్రాల సంఖ్య-1,532
2.ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలు-400
3. ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాల కేంద్రాలు -242
4.ప్రైవేట్ జూనియర్ కళాశాల కేంద్రాలు- 861
5. పాఠశాలలు/ఇతర కళాశాలలు -29
1. పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్య -9,96,971
2. మొదటి సంవత్సరం విద్యార్థులు- 4,88,448
3.రెండో సంవత్సరం విద్యార్థులు (రెగ్యులర్) -4,40,788
4.రెండో సంవత్సరం విద్యార్థులు (ప్రైవేట్)- 67,735
5 .రెండో సంవత్సరం విద్యార్థులు (మొత్తం)- 5,08,523
1.పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్య- 1,42,245
2.మొదటి సంవత్సరం విద్యార్థులు- 68,090
3.రెండవ సంవత్సరం విద్యార్థులు (రెగ్యులర్) -58,739
4.రెండో సంవత్సరం విద్యార్థులు (ప్రైవేట్)- 15,416
5. రెండవ సంవత్సరం విద్యార్థులు (మొత్తం)- 74,155
1. చీఫ్ సూపరింటెండెంట్ల మొత్తం సంఖ్య 1532
2.డిపార్ట్‌మెంటల్ అధికారుల మొత్తం సంఖ్య 1532
3.మొత్తం ఇన్విజిలేటర్ల సంఖ్య 29992
4.ఫ్లయింగ్ స్క్వాడ్‌ల మొత్తం సంఖ్య 72
5.సిట్టింగ్ స్క్వాడ్‌ల మొత్తం సంఖ్య 124
సంబంధిత కథనం