రేపు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - ఈ లింక్స్ తో చెక్ చేసుకోవచ్చు-telangana inter advance supplementary exam 2025 results to be released tomorrow ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  రేపు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - ఈ లింక్స్ తో చెక్ చేసుకోవచ్చు

రేపు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - ఈ లింక్స్ తో చెక్ చేసుకోవచ్చు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రానున్నాయి. సోమవారం (జూన్ 16) మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. https://tgbie.cag.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం(జూన్ 16) మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఫలితాలను https://tgbie.cag.gov.in లేదా http://results.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

మే 22 నుంచి 29 వరకు తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మూల్యాంకనంతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన పూర్తి కావటంతో… సోమవారం ఫలితాలను ప్రకటించనున్నారు.

టీజీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోవాలి:

  1. పరీక్ష రాసిన విద్యార్థులు https://tgbie.cag.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఆప్షన్లు కనిపిస్తాయి.
  4. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  5. మీ స్కోర్ డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కాగా…కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,51,779 మంది విద్యార్థులు క్వాలిఫై కాగా…. అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో 71,309 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

జూలై మొదటి వారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈసారి అగస్టు 14లోపు సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.