TG Court Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త - తెలంగాణలో 1673 కోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే-telangana high court has announced the recruitment of 1673 posts in various courts ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Court Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త - తెలంగాణలో 1673 కోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే

TG Court Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త - తెలంగాణలో 1673 కోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 03, 2025 08:42 PM IST

Telangana High Court Recruitment 2025 : ఉద్యోగాల భర్తీపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పలు కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1,673 ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు జనవరి 8వ తేదీ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

1673 ఉద్యోగాలు - హైకోర్టు ప్రకటన
1673 ఉద్యోగాలు - హైకోర్టు ప్రకటన

ఈ కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రంలో ఉన్న పలు కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది. మొత్తం1,673 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 1277 టెక్నికల్ ఉద్యోగాలు ఉండగా.. మరో 184 నాన్-టెక్నికల్ కోటాలో ఉన్నాయి. ఇక తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులను కూడా రిక్రూట్ చేయనున్నారు.

yearly horoscope entry point

ఈ పోస్టులకు సంబంధించిన్ ఆన్ లైన్ దరఖాస్తులు జనవరి 8, 2025వ తేదీతో ప్రారంభం కానున్నాయి. జనవరి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ లో రాత పరీక్షలు జరుగుతాయి. మరికొన్ని పోస్టులకు జూన్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలను పార్టీ ఏ, పార్టీ బీలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలతో పాటు స్కిల్స్ టెస్ట్ ఆధారంగా తుది జాబితాలను ప్రకటిస్తారు. అయితే పోస్టుల వివరాలతో కూడిన నోటిఫికేషన్లు హైకోర్టు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - తెలంగాణ హైకోర్టు
  • మొత్తం ఖాళీలు - 1673
  • విభాగాలు - టెక్నికల్ -1277, నాన్ టెక్నికల్ - 184, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్-212 ఖాళీలు
  • పోస్టులను అనుసరించి అర్హతలు ఉంటాయి. కొన్ని పోస్టులకు టెన్త్ అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు మాస్టర్‌ అండ్ పర్సనల్ సెక్రటేరియస్‌ వంటి పోస్టులకు లా డిగ్రీతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
  • ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.
  • దరఖాస్తులు ప్రారంభం - 8 జనవరి 2025.
  • దరఖాస్తులకు చివరి తేదీ - 31 జనవరి 2025
  • రాత పరీక్షలు - ఏప్రిల్, జూన్ 2025
  • ఎంపిక విధానం - రాత పరీక్షలు, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితా ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/showChildDocTypes?id=95

Whats_app_banner

సంబంధిత కథనం