TG High Court Jobs : తెలంగాణ హైకోర్టు సర్వీస్ రూల్స్ ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్లు మొత్తంగా 1673 పోస్టుల నియామకం కోసం దరఖాస్టులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 15 నుంచి 20 వరకు షిఫ్ట్ ల వారీగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది. తాజాగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు దరఖాస్తులు చేసున్న అభ్యర్థులందరికీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు/నైపుణ్య పరీక్షల హాల్ టికెట్లు 08-04-2025 నుంచి హైకోర్టు వెబ్‌సైట్ www.tshc.gov.in లో అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ హైకోర్టు నోటిఫికేషన్లు జారీ చేసింది.
అభ్యర్థుల కంప్యూటర్ ఆధారిత పరీక్షలు/స్కిల్ టెస్ట్ ల హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 8 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
సంబంధిత కథనం